మాదాపూర్, వెలుగు: యుకీ ఇండియన్ డాన్స్ కంపెనీ (జపాన్), నృత్యమాల డాన్స్ అకాడమీ (హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన ‘సంపత్తి’ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జపాన్ కళాకారులు యుకీ సతో, యుకాకో మాసే, ఫుయుమి నరిట ఒడిసి నృత్యంలో మంగళాచరణం, మేఘ పల్లవి, సఖి, మోక్ష ఆంశాలను ప్రదర్శించారు. కూచిపూడి నృత్యంలో మేఖల, యశస్వినీ, శ్రుతి, కావ్య చంద్రిక, వెన్నెల, నిహారిక, పవిత్ర, శ్రీఅనన్య వందేహం జగత్ వల్లభం, ఆనందామృతకర్షిణి, జటాధరా శంకర ఆంశాలతో మెప్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి మిడిల్ఆసియాకు చెందిన 21 మంది జర్నలిస్టులు శిల్పారామాన్ని సందర్శించారు. స్టాల్స్ చూసి, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.
