
మెహిదీపట్నం, వెలుగు: 13 ఏళ్ల బాలిక ఆకర్షణ చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ తన 23వ లైబ్రరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ ఆకర్షణను అభినందించారు.
కొత్త లైబ్రరీలో ఇంగ్లిషు, తెలుగు, హిందీ భాషలలో 575 పుస్తకాలు ఉంచినట్లు ఆకర్షణ తెలిపారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ సేవా భావానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ నాయకులు నుంచి గుర్తింపు పొందిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయం చైర్ పర్సన్ భారతీ దేవి, బాలికలు, సిబ్బంది పాల్గొన్నారు.