
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫ్యాషన్ షో లో గెలుపొందిన వారికి మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. కాగా, చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు కార్మికులకు ఉపాధి దొరుకుతుందని గద్వాల కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. గద్వాల చేనేతకు 200 ఏళ్ల చరిత్ర ఉందని, కాటన్, సిల్క్ మేళవింపుతో తయారయ్యే గద్వాల చీరలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. -గద్వాల, వెలుగు: