బ్రిటన్​లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా

బ్రిటన్​లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త రకం కరోనా
అవుటాఫ్​ కంట్రోల్​గా వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ ఇప్పటి వైరస్ కన్నా 70% ఎక్కువ స్పీడ్ గా వ్యాపిస్తోంది యూకేలో ఆదివారం నుంచి మళ్లీ స్ట్రిక్ట్ లాక్ డౌన్ బ్రిటన్​తో ఫ్లైట్లు  రద్దు చేసుకుంటున్న యూరప్ కంట్రీస్ నేడు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ అత్యవసర మీటింగ్ న్యూఢిల్లీ: వ్యాక్సిన్ లతో కరోనా మహమ్మారి పీడ విరగడైపోతది అనుకుంటే.. అది రూపం మార్చుకుని మరింత తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ అవుటాఫ్​ కంట్రోల్ గా వ్యాపిస్తోంది. మునుపటి వైరస్ కన్నా ఈ మ్యుటెంట్ చెందిన ఈ కొత్త స్ట్రెయిన్ మరింత వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ వెల్లడించింది. ఆదివారం నుంచే ప్రజలు ‘స్టే ఎట్ హోం’ లాక్ డౌన్ ను తప్పనిసరిగా పాటించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ఉదయం10 గంటలకు అత్యవసర మీటింగ్ నిర్వహించనుంది. బ్రిటన్ లో వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ విషయంపై హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన ‘కొవిడ్ 19 జాయింట్ మానిటరింగ్ గ్రూప్’ చర్చించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  మన దేశంలోని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి రోడెరికో హెచ్ ఓఫ్రిన్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. 70% వేగంగా వ్యాపిస్తోంది.. బ్రిటన్ లో ఇప్పటి కరోనా స్ట్రెయిన్ కన్నా కొత్త స్ట్రెయిన్ 70 శాతం ఎక్కువగా ఇతరులకు సోకే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిని బ్రిటన్ లో ఓ పేషెంట్ లో సెప్టెంబర్ లో కనుగొన్నారు. అయితే దీనివల్ల మరణాలు కూడా అంతే తీవ్రంగా పెరుగుతాయా? ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్ లు, ట్రీట్ మెంట్లు పనిచేస్తాయా? అన్నవాటిపై ఇప్పుడేమీ చెప్పలేమని సైంటిస్టులు చెప్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ రూల్స్ ను స్ట్రిక్టుగా ఫాలో అవ్వాల్సిందేనని ఆదివారం బ్రిటన్ హెల్త్ మినిస్టర్ మాట్ హన్ కాక్ స్పష్టం చేశారు. తాము చాలా త్వరగా, కచ్చితత్వంతో స్పందించి, ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అత్యవసరం కాని షాపులన్నీ మూసేయాలని, క్రిస్ మస్ వేడుకల కోసం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నూ నిషేధిస్తున్నామని ప్రకటించారు. కొత్త స్ట్రెయిన్ అవుటాఫ్​ కంట్రోల్ గా వ్యాపిస్తోంది. దానిని కంట్రోల్ చేసేంత వరకూ ఆంక్షలు తప్పవన్నారు. యూరప్ కు ఫ్లైట్లు రద్దు.. బ్రిటన్ లో మ్యుటెంట్ వైరస్ వ్యాపిస్తుండటంతో ఆ దేశంతో యూరప్ దేశాలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు యూకేతో విమాన సర్వీసుల పై ఆస్ట్రియా , బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ దేశాలు ఆంక్షలు విధించాయి. సౌత్ ఆఫ్రికాలోనూ మరో కరోనా వేరియంట్ వెలుగు చూడటంతో ఆ దేశంతో విమానాలనూ జర్మనీ రద్దు చేసుకుంది. అయితే యూకేతో ఫ్లైట్ సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫ్లైట్ల రద్దు విషయాన్ని కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తోందని సమాచారం.