‘‘దేశం గర్వించదగ్గ సినిమా ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల ఫిల్మ్ ఫెస్టివల్‌ను శుక్రవారం (నవంబర్ 21) ఆయన ప్రారంభించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్‌లో భాగంగా రెండు రోజుల పాటు ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు సంస్కృతి, ప్రకృతి పరంగా దేశంలోనే వైవిధ్యమైనవని, మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారని ఆయన చెప్పారు.
