మాదాపూర్, వెలుగు: తందనాన అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీల గ్రాండ్ ఫినాలేను డిసెంబర్ 20న హైటెక్ సిటీ సమీపంలోని అన్నమయ్యపురంలో నిర్వహించనున్నట్లు అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు తెలిపారు. గురువారం తమ సంస్థ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఆరేళ్లలోపు, ఏడు నుంచి పద్నాలుగేండ్లు, పదిహేనేండ్ల వయస్సుగా మూడు కేటగిరీలు చేశామన్నారు. ఈ పోటీల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు దుబాయ్, సింగపూర్, అమెరికా సహా 12 దేశాల నుంచి 700 పైగా ఎంట్రీలు వచ్చాయన్నారు. వీటిని జ్యూరీ బృందం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తుందన్నారు.
ఈ ప్రక్రియ అనంతరం గ్రాండ్ ఫినాలే కోసం 9 మంది గాయకులను ఎంపిక చేసి, వీరిలో ముగ్గురు విజేతలకు గోల్డ్ మెడల్స్ అందజేస్తామన్నారు. సమావేశంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ జ్యోత్స్, సలహాదారు సుబ్బా రావు, మేనేజింగ్ట్రస్టీ డా. నంద కుమార్ పాల్గొన్నారు.
