
లాహోర్: పాకిస్తాన్‌తో తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా తడబడింది. పాక్ నిర్దేశించిన 277 రన్స్ లక్ష్య ఛేదనలో.. మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టు ఆట ముగిసే టైమ్‌కు 22 ఓవర్లలో 51/2 స్కోరు చేసింది. రైన్ రికెల్టన్ (29 బ్యాటింగ్), టోనీ డి జార్జీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (3), వియాన్ ముల్డర్ (0) నిరాశపర్చారు.
నోమన్ అలీ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు 216/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 269 రన్స్‌కు ఆలౌటైంది. టోనీ డి జార్జీ (104) సెంచరీతో చెలరేగగా, లోయర్ ఆర్డర్ ఫెయిలైంది. నోమన్ అలీ 6, సాజిద్ ఖాన్ 3 వికెట్లు తీశారు.
ఇక 109 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్తాన్ 46.1 ఓవర్లలో 167 రన్స్‌కు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (42) టాప్ స్కోరర్. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. సేనురన్ ముత్తుసామి 5, సిమోన్ హార్మర్ 4 వికెట్లు పడగొట్టారు.
ఒకే రోజు 16 వికెట్లు పడటంతో మ్యాచ్‌లో ఉత్కంఠ మొదలైంది. ఓవరాల్‌గా సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 226 రన్స్ చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉండగా, రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఒకవేళ సౌతాఫ్రికా నెగ్గితే లాహోర్ గ్రౌండ్‌లో ఇదే రికార్డ్ ఛేజింగ్ అవుతుంది. 1961లో ఇంగ్లండ్ 208 రన్స్ టార్గెట్‌ను ఛేదించింది.