పెద్దపులి శ్యామ్-2 ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

పెద్దపులి శ్యామ్-2 ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

కుమ్రంభీం జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలో మ్యాన్ ఈటర్ పెద్దపులి శ్యామ్-2 ని ఫారెస్ట్ అధికారులు  పట్టుకున్నారు. చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి తాలూకా సాయిగటా ప్రాంతంలో శ్యామ్-2 పెద్దపులి నలుగురిని చంపింది. దీంతో ఫారెస్ట్ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు, షూటర్ లు పెద్దపులి కోసం మాటు వేశారు. గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో శ్యామ్-2 స్పృహ కోల్పోయింది. పెద్దపులిని చంద్రపూర్ లోని ట్రాజెడీ ట్రీట్  మెంట్ సెంటర్  కి తరలించిన అధికారులు.. పులి కోసం నెలరోజుల పాటు ఆపరేషన్ కొనసాగించామని తెలిపారు.

మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులుల సంచారం పెరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులుల కదలికను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దట్టమైన అడవులలోకి పులులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.