రొమాంటిక్ మూడ్ లో నాగార్జున

రొమాంటిక్ మూడ్ లో నాగార్జున

టాలీవుడ్ మన్మథుడు ‘నాగార్జున’ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ లో రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది. నాగార్జున, సోనాల్ చౌహాన్ మీద చిత్రీకరించిన ‘వేగమ్’ సాంగ్ ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. ‘వదలక వదిలే ప్రాయం’ అంటూ సాంగ్ సాగింది. ఈ మెలోడియస్ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనిలోని ఓ స్టిల్ ను కూడా విడుదల చేశారు. ఇందులో నాగార్జున, సోనాల్ లు క్రూయిజ్ లో ఉండడం కనిపించింది. భరత్ - సురభ్ స్వర పరిచిన ఈ పాటను కృష్ణ మదినేని రాశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా పాడారు. ఫుల్ సాంగ్ ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ’ది ఘోస్ట్‘ మూవీని అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. 

ఓ వైపు సినిమాలు, మరోవైపు షోలతో నాగార్జున ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో హిట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా క్లిష్ట సమయంలో కూడా ‘బంగర్రాజు’ సినిమాను నాగ్ విడుదల చేశారు. కొడుకు నాగ చైతన్య’తో కలిసి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో ఓ స్పెషల్ పాత్రను ఆయన పోషించారు. ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. మరి ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందా ? లేదా ? అనేది తెలియాలంటే వేచిచూడాలి.