ప్లాట్ల వేలంతో సర్కారుకు రూ.567 కోట్ల ఆమ్దానీ

ప్లాట్ల వేలంతో సర్కారుకు రూ.567 కోట్ల ఆమ్దానీ
  • అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం
  • వివరాలు వెల్లడించిన హెచ్ఎండీఏ అధికారులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్లాట్ల వేలంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆమ్దానీ వచ్చింది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏతో పాటు పలు మున్సిపాలిటీల పరిధిలో డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ప్లాట్లను హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలానికి పెట్టింది. 4 రోజులుగా వేలం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ అధికారులు గురువారం విడుదల చేశారు. ప్లాట్ల అమ్మకంతో ప్రభుత్వానికి రూ.399.46 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.567.25 కోట్లు వచ్చింది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోని బాచుపల్లిలో రూ.140.23 కోట్లు, తొర్రూరులో రూ.194.49 కోట్ల ఆదాయం వచ్చింది. నల్గొండ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ పరిధిలోని నార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో రూ.31.77 కోట్లు, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని బూత్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.90.72 కోట్లు, గద్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.51.91 కోట్లు, కామారెడ్డిలో రూ.34.19 కోట్లు, పెద్దపల్లిలోని అంతర్గాంలో రూ.19.62 కోట్లు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మావలలో రూ.3.41 కోట్లు, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యాలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.90.7 లక్షల ఆదాయం వచ్చింది. బాచుపల్లిలో రూ.25 వేల బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 46,611 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయగా, గజానికి రూ.38,500 ధర పలికింది. తొర్రూరులో రూ.20 వేల బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుగానూ అత్యధికంగా రూ.50 వేల ధర వచ్చింది. మిగతా మున్సిపాలిటీల పరిధిలోనూ సర్కారు నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ మొత్తానికి కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ప్లాట్లు దక్కించుకున్నారు. మావల, యాలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్ప బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్నా కొద్ది మొత్తం ఎక్కువ పలకగా, మిగతా అన్ని చోట్ల రెట్టింపు, అంతకన్నా ఎక్కువ ధరకు ప్లాట్లు కొనుగోలు చేశారు.