ఆసరా పెన్షన్ల వయోపరిమితి తగ్గింపు

ఆసరా పెన్షన్ల వయోపరిమితి తగ్గింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏజ్ లిమిట్ తగ్గించటంతో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్ల డించింది. ఆసరా పెన్షన్లు పొందే వయోపరి మితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రస్తుతమున్న ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 35,95,675 నుంచి 45, 80,746కు చేరినట్లు చెప్పింది. కొత్త పెన్షన్లతో సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అద నం గా రూ.3వేల కోట్లను ఖర్చు చేయనున్నది. ఆసరా పెన్షన్లకు నెలకు రూ.975 కోట్ల చొప్పున ఏడాదికి రూ.12,060 కోట్లను వెచ్చించనున్నది. 57 ఏండ్లు పైబడిన 5,97, 207 మం దితో పాటు ఇతర పెన్షన్లు 3,87,864 మంది ఇస్తున్నారు. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సంఖ్య  45,80,746కు చేరుకుంది.