పనితీరు ఆధారంగా వీఆర్వోలకు గ్రేడ్లు

పనితీరు ఆధారంగా వీఆర్వోలకు గ్రేడ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పని చేస్తున్న వీఆర్వోల వివరాలను వెంటనే పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం సీసీఎల్​ఏ అధికారులు ప్రత్యేక ఫార్మాట్ ను పంపారు. అందులో వీఆర్వో పేరు, మండలం, సొంతూరు, ఎంప్లాయ్ ఐడీ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, అపాయింట్ మెంట్ అయిన విధానం (కంపాషనేట్/డైరెక్ట్ రిక్రూట్మెంట్​), పాత ఉమ్మడి జిల్లా పేరు, గత మూడేళ్లలో పని చేసిన ప్రాంతాలు, ప్రస్తుతం ఉన్న మండలంలో చేరిన తేదీ, క్యాస్ట్, డిసేబులిటీ, సస్పెన్షన్​/లీవ్​/ అబ్​స్కాండింగ్ వివరాలను పొందుపరిచారు. అలాగే సదరు వీఆర్వో పనితీరును అసెస్మెంట్​ చేస్తూ తహసీల్దార్లు ఏ,బీ,సీ,డీ గ్రేడ్స్ ఇవ్వాలని ఓ కాలమ్ పెట్టారు. ఇంకా రిమార్క్స్ ఉన్నా చెప్పాలని ప్రత్యేకంగా కాలమ్​ ఇచ్చారు. వీఆర్వోల పనితీరు ఆధారంగా శాఖలు కేటాయించేందుకే గ్రేడింగ్ అడిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఒకవేళ వీఆర్వోలను ఇతర శాఖల్లో  జాయిన్​ కావాలని ఆదేశాలు జారీ చేస్తే, ఏ ఒక్కరూ జాయిన్ కావొద్దని తెలంగాణ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోలకొండ సతీశ్​ పిలుపునిచ్చారు.