వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు విస్తరణపై సర్కారు దృష్టి పెట్టింది. 2024 నాటికి 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌‌‌‌‌‌‌‌ పంటను సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొలకెత్తిన విత్తనాలను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మలేషియా, కోస్టారికా, ఇండోనేషియా, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ల  దేశాల నుంచి 5 కోట్ల మొలకెత్తిన ఆయిల్‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌ విత్తనాల కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ ఎండీ సురేందర్, ఉద్యానశాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ వెంకట్రామ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ అఖిల్‌‌‌‌‌‌‌‌కుమార్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వారం రోజులపాటు ఆయా దేశాల్లో పర్యటించి విత్తనాల కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

విత్తనాలు ఇచ్చేందుకు 11 కంపెనీలు రెడీ

మొలకెత్తిన ఆయిల్​పామ్ సీడ్స్ ఇచ్చేందుకు 11 ఇంటర్నేషల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ ఎండీ సురేందర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. విత్తనాలు వచ్చే ఏడాది రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు సరిపడా మొలకెత్తిన విత్తనాలు ఈ 4 దేశాల నుంచి దిగుమతి కానున్నాయి. అవి రాగానే ఏడాదిపాటు రాష్ట్రంలో ఉన్న ఆయిల్‌‌‌‌‌‌‌‌పాం నర్సరీల్లో పెంచి, 2024లో వాటిని నాటనున్నారు. ఈ విత్తనాల దిగుమతికి రూ.375 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. విత్తనాల ధరలపై ప్రతిపాదనలు పంపాలని ఆయా కంపెనీలను కోరామని, ధరలు ఖరారు కాగానే  ఆ కంపెనీలతో ఎంవోయూ చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రభుత్వం కోటి మొక్కలు ఒకేసారి కొనుగోలు చేయగా, ప్రస్తుతం 5 కోట్ల ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సీడ్స్ ను కొనుగోలు చేయడం గమనార్హం.