వసతిగృహాల్లో డైట్‌ చార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

వసతిగృహాల్లో డైట్‌ చార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం (జులై 22న) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్‌ చార్జీలు పెరగనున్నాయి. పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టల్స్‌లోనూ డైట్‌చార్జీలు పెరుగనున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8 నుంచి పదో తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1400 వరకు పెంచింది. ఇంటర్‌ నుంచి పీజీ వరకు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.