లోకల్ బాడీ ఎన్నికల కోసం రూ.325 కోట్లు

లోకల్ బాడీ ఎన్నికల కోసం రూ.325 కోట్లు
  •     సర్పంచ్ ఎన్నికలకు రూ.175 కోట్లు 
  •     ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రూ.150 కోట్లు
  •     బడ్జెట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మంజూరు చేసింది. ఎన్నికల ఖర్చు కోసం పంచాయతీరాజ్​శాఖ రూ.450 కోట్లకుపైగా ప్రపొజల్స్​పంపించగా.. ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. సర్పంచ్ ల​ఎన్నిక కోసం రూ.175 కోట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నిక కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది. 

ఈ నిధులను బ్యాలెట్​ పత్రాలు, పోలింగ్ కు​సంబంధించిన మెటీరియల్, ఎన్నికల సిబ్బంది శిక్షణ కోసం వినియోగించనున్నారు. ఆయా జిల్లాలకు పోలింగ్​ కేంద్రాల వారీగా ఈ నిధులు పంపిణీ చేస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికకు సంబంధించి జడ్పీ సీఈఓలకు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి డీపీఓల అకౌంట్లో ఈ ఫండ్స్ జమ చేయనున్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.