
సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం ఓ లేఖ రాశారు. పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్ సరఫరా విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక సిబ్బందికి, సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 63 ప్రకారం రూ.5 వేలకు సంబంధిత జీపీలు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ చాలా జీపీలు చెల్లించలేకపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేయబోతున్న రూ.339 కోట్ల నిధుల నుంచి ప్రతి కార్మికుడికి రూ.8,500 చెల్లించాలని కోరారు.