ప్రభుత్వ దవాఖాన్లలో భోజన చార్జీలపై సర్కార్ జీవో

ప్రభుత్వ దవాఖాన్లలో భోజన చార్జీలపై సర్కార్ జీవో

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్‌‌‌‌పేషెంట్లు, డాక్టర్లకు పెట్టే భోజన చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. పేషెంట్లకు ఉదయం టిఫిన్‌‌‌‌, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెట్టడానికి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం ఒక్కో పేషెంట్‌‌‌‌కు రూ.40 చొప్పున చెల్లిస్తుండగా.. దీన్ని రూ.80కి పెంచుతున్నట్టు పేర్కొంది. టీబీ, ఎయిడ్స్‌‌‌‌, కేన్సర్, మెంటల్ ఇష్యూస్‌‌‌‌తో బాధపడుతున్న పేషెంట్ల భోజన చార్జీని రూ.56 నుంచి రూ.112కి పెంచింది. డ్యూటీ డాక్టర్లకు పెట్టే భోజనానికి ప్రస్తుతం రూ.80 చెల్లిస్తుండగా, దీన్ని 160కి పెంచింది. దీన్ని బట్టి డాక్టర్లకు పెట్టే భోజనానికి, పేషెంట్లకు పెట్టే భోజనానికి నాణ్యతలో ఎంత తేడా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.