చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం గుర్తించాలి

V6 Velugu Posted on Mar 25, 2021

మహేశ్వరం: చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం వెలుగులోకి తేవాలన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. గురువారం ఆయన..తుక్కుగూడలో జరిగిన వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పురాతన దేవాలయాల చరిత్ర చాలా వరకు భక్తులకు తెలియదని.. ప్రభుత్వం చొరవతో చరిత్ర కలిగిన తెలంగాణలోని దేవాలయాలను వెలుగులోకి తేలవాలన్నారు. గతంలో ఈ ఆలయానికి సంబంధించిన భూమి 350 ఎకరాల్లో ఉండేదని.. ప్రస్తుతం అది 3 ఎకరాలకు కుదించుకు పోయిందన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే కనీసం 40 ఎకరాల భూమి కావాలని ఇక్కడి స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని, 40 ఎకరాలు కేటాయించాల వివేక్ కోరారు.


 

Tagged Bjp, government, TEMPLES, vivekvenkataswamy, Identify

Latest Videos

Subscribe Now

More News