ఘనంగా ‘మేరీ మాటీ మేరా దేశ్’ ముగింపు ఉత్సవాలు

ఘనంగా ‘మేరీ మాటీ  మేరా దేశ్’ ముగింపు ఉత్సవాలు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజలలో దేశభక్తి భావనను తట్టిలేపి, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నిర్వహించిన ‘మేరీ మాటీ మేరా దేశ్’, ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. రెండేళ్ల పాటు సాగిన ఈ ప్రోగ్రాం ముగింపు వేడుకలను మంగళవారం కర్తవ్యపథ్​ లో కేంద్రం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్​షా, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకల తర్వాత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.  సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘మేరా మాటీ మేరా దేశ్’ ప్రోగ్రాంలో 6 లక్షల గ్రామాలలోని కోట్లాది ఇండ్ల నుంచి అమృత కలశాల్లో, మట్టి, బియ్యాన్ని సేకరించి తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో దాదాపు 75 వేల మంది యువతీయువకులు పాల్గొన్నారని కిషన్ రెడ్డి చెప్పారు.