
కరోనావైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్ విధించింది. ముందు నిశ్చయించుకున్న ముహుర్తం ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో లాక్ డౌన్ సందర్భంగా ఓ పెళ్ళికొడుకు ఆటోలో బయలుదేరి పెళ్లికి వెళ్ళాడు. స్థానిక పోలీసులు ఆటోను ఆపి అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దాంతో ఆ యువకుడు స్థానిక అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వారికి చూపించి పెళ్లికి బయల్దేరాడు. ఆటోలో కేవలం పెళ్లి కొడుకుతో సహా నలుగురు మాత్రమే వివాహానికి హాజరైనట్లు పోలీసులు తెలిపారు.