‘విద్యార్థుల సందేహాలను మొబైల్ ద్వారా ఎలా తీర్చుతారు?’

‘విద్యార్థుల సందేహాలను మొబైల్ ద్వారా ఎలా  తీర్చుతారు?’

ప్రైవేట్ స్కూల్ ఫీజులు, ఆన్‌లైన్ తరగతుల పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1నుండి ప్రారంభించనున్న ఆన్‌లైన్ క్లాస్ లకు సంబంధించి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ లో టీవీల ద్వారా, మొబైల్ ద్వారా నిర్వహించే క్లాసులలో విద్యార్థుల సందేహాలను ఎలా నివృత్తి చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ పై పూర్తి విధివిధానాలను సెప్టెంబర్ 18 లోపు కౌంటర్ ఫైల్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫీజుల విషయంలో సీబీఎస్ఈ స్కూల్స్ రాష్ట్రప్రభుత్వం లోబడి ఉంటాయని సీబీఎస్ఈ కౌంటర్ ఫైల్ లో స్ప‌ష్టం చేసింది. సీబీఎస్ఈ పరిధిలో కేవలం ఎగ్జామ్స్ సిలబస్ అప్లియేషన్ మాత్రమే ఉంటాయని తెలిపింది. ఆన్లైన్ తరగతుల నిర్వహణ పై పూర్తి విధివిధానాలను సెప్టెంబర్ 18 లోపు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబర్ 18 కి వాయిదా వేసింది.