పెండ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా..? టీచర్లకే ఇదేం నిబంధన : హైకోర్టు ప్రశ్న

పెండ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా..? టీచర్లకే ఇదేం నిబంధన : హైకోర్టు ప్రశ్న
  • పెండ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా..?
  • టీచర్లకే ఇదేం నిబంధన
  • ఏ ప్రాతిపదికన ఈ వివక్ష
  • సర్కాను ప్రశ్నించిన హైకోర్ట్
  • విచారణ ఈ నెల 23కు వాయిదా 

టీచర్లు.. పెండ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామనే నిబంధనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీచర్ల బదిలీలపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.  బదిలీల ప్రక్రియలో ఏ ప్రాతిపదినక టీచర్లపై వివక్ష చూపిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.  భార్యాభర్తలు ఒకేచోట ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చినట్టు తెలిపారు. 

బదిలీలకు సంబంధించి నిబంధనలను సవరించామని, వాటిని అసెంబ్లీ, కౌన్సిల్‌ ముందు ఉంచినట్లు కోర్టుకు వివరించారు. ఈ మేరకు నిబంధనల మార్పులపై ఏజీ కోర్టుకు మెమో సమర్పించారు. స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఎన్నికలు వస్తున్నందున త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ.. మెమో, కౌంటర్లు ఇవాళే ఇచ్చినందున కొంత సమయం కావాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న హైకోర్టు కేసు విచారణను  ఈ నెల 23కు వాయిదా వేసింది.