కర్ఫ్యూ లేదా లాక్ డౌన్.. ప్రభుత్వానికి 48 గంటలు గడువు

కర్ఫ్యూ లేదా లాక్ డౌన్..  ప్రభుత్వానికి 48 గంటలు గడువు

తెలంగాణలో కరోనా విజృంభిస్తుండటంతో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే తామే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. హాస్పిటల్స్ లలో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారిని ఎవ్వరినైనా నియమించాలని ఆదేశించింది. వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని చెప్పింది. పెళ్లిళ్లు, శుభకార్యాలలో పబ్లిక్ ప్లేస్ లలో చర్యలు తీసుకోవాలని సూచించింది. జీహెచ్ఎంసీలో నమోదైన కేసులు వార్డుల వారిగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. డీజీపీ, ఆరోగ్య అధికారులు ఇచ్చిన నివేదిక తప్పులు తడకగా ఉందన్న హైకోర్టు..కరోనా పరిస్థితులపై మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికివ్వాలని చెప్పింది. రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా టెస్టులు చేయాలని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.