కరోనాపై విచారణ: ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్

కరోనాపై విచారణ:  ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఆస్పత్రుల్లో డిస్ ప్లే బోర్డులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందంటూ మండిపడింది. అధికారుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అయితే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని అధికారులు కోర్టుకు సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో రెండో స్టేజ్ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని హైకోర్టు కామెంట్ చేసింది. WHO నిబంధనల ప్రకారం రాష్ట్రంలో సరిపడా బెడ్లు కూడా లేవంది హైకోర్టు. రాష్ట్రంలో మొబైల్స్ టెస్ట్ కిట్స్ పెంచాలని సూచించింది. రాష్ట్రంలో వెంటిలేటర్స్ పెరగడంతోపాటు.. కరోనా పేషెంట్ల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది.