మంథని లాకప్‌‌ డెత్‌‌ బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలే?

మంథని లాకప్‌‌ డెత్‌‌ బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలే?

రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌‌స్టేషన్‌‌లో శీలం రంగయ్య లాకప్‌‌ డెత్‌కు కారణమైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వివరాలను డిసెంబర్‌‌ 14లోగా అందజేయాలని  ఆదేశించింది. నిరుడు మే 26న పోలీసులు కొట్టడం వల్లే లాకప్‌‌లో శీలం రంగయ్య చనిపోయాడని, స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని లాయర్‌‌ వామనరావు (ఇటీవల వామనరావు, ఆయన భార్య హత్యకు గురయ్యారు) వేసిన పిల్‌‌ను బుధవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్‌‌ ఎ.రాజశేఖర్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. పోలీస్‌‌ కమిషనర్‌‌ దర్యాప్తు చేసి హైకోర్టుకు రిపోర్టు ఇచ్చారని కోర్టుకు ఏజీ తెలిపారు.