- ఈడీ జప్తు చేసిన భూములను ఎలా కొన్నారని పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: నౌహీరా షేక్‌కు చెందిన భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేశాక కూడా వేలం ఆపాలని పిటిషన్లు ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఈడీ 2019లో నౌహీరా షేక్ ఆస్తులను జప్తు చేసిందని, ఆ తర్వాత అవే ఆస్తులను పిటిషనర్ ఎలా కొనుగోలు చేశారని నిలదీసింది.
ఈ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చితే ఇలాంటి సమస్యలు ఉండవని, నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చేవెళ్ల మండలం అల్లూరులోని10.11 ఎకరాలను ఈడీ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ నానక్‌రామ్‌గూడకు చెందిన షేరాజ్, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారించింది.
