హీరో కంటే.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎక్కువ.. రెహ్మాన్ కంటే కూడా..

హీరో కంటే.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎక్కువ.. రెహ్మాన్ కంటే కూడా..

సినిమా అనే రంగుల ప్రపంచంలో సంగీతం ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది. ఎన్నో దశాబ్దాల మూవీస్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలిజీ  వరకు మ్యూజిక్  డైరెక్టర్స్ అందిస్తున్న స్వరాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో కీలకం. అటువంటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఆలోచించినప్పుడు, మనకు వెంటనే ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త ఏఆర్ రెహమాన్(, AR Rahman) గుర్తుకు వస్తారు. అనేక భాషలలో 145 చిత్రాలకు పైగా సంగీతం అందించిన మార్గదర్శకుడు రెహమాన్,  ఇతను భారతదేశంలోని అత్యంత ధనిక సంగీత దర్శకుల్లో ఒకరిగా చెప్పబడుతూ, రూ. ఒక్కో పాటకు 3 కోట్లు. అయితే అటువంటి సంగీత దిగ్గజాన్ని మరొకరు అధిగమించినట్లు తెలుస్తోంది.

భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అని కొన్ని ఫేమస్ రిపోర్ట్స్ అంచనా వేస్తున్నాయి. అందుకు డైరెక్టర్ అట్లీ, షారుక్ ఖాన్ కాంబోలో వస్తున్న జవాన్ మూవీ కోసం రూ.10 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన వై దిస్ కొలవెరి డి..ధనుష్ 3 మూవీ నుంచి తెలుగులో జెర్సీ, గ్యాంగ్ లీడర్, మాస్టర్, విక్రమ్ ఇలా ప్రతి మూవీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు NTR, కొరటాల శివ కాంబో లో రాబోతున్న దేవర మూవీ కొరకు ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు.  అనిరుధ్.. మొదట తలపతి విజయ్, అజిత్, రజనీకాంత్ వంటి స్టార్ యాక్టర్స్ తో వర్క్ చేసి తన టాలెంట్ ను నిరుపించుకున్నారు. ఇక వరస మూవీస్ తో దూసుకెళ్తున్న అనిరుధ్ ఖాతాలో.. దేవర, కమల్ హాసన్ ఇండియన్ 2, విజయ్ దళపతి లియో, రజనీకాంత్  జైలర్ మూవీస్ ఉన్నాయి. 

లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో తన స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత,  రవిచందర్  మొదటి మ్యూజిక్ ట్రాక్ కోసం ధనుష్‌తో కలిసి పనిచేయడానికి ఇండియాకు తిరిగి వచ్చారని తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి అనిరుధ్  వెనుదిరిగి చూసే పరిస్థితి లేదు. 

AR రెహమాన్, అమిత్ త్రివేది, విశాల్ - చంద్ర శేఖర్ వంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ను అధిగమించి.. దేశంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ పొందే సంగీత దర్శకుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన అనిరుధ్.. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ మేనల్లుడు కావడం విశేషం.