V6 News

డ్రాగన్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ మళ్లీ వస్తోంది.. టీజర్ వచ్చేసింది !

డ్రాగన్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ మళ్లీ వస్తోంది.. టీజర్ వచ్చేసింది !

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఫాంటసీ డ్రామా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 3కి సంబంధించి క్రేజీ అప్‌‌‌‌డేట్ వచ్చింది. ఈ సీజన్‌‌‌‌కు సంబంధించిన కొత్త టీజర్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను హెచ్‌‌‌‌బివో తాజాగా విడుదల చేసింది. ఒకటిన్నర నిమిషం నిడివి గల టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా రాణి తన కొత్త డ్రాగన్ రైడర్లతో కలిసి కింగ్స్ ల్యాండింగ్‌‌‌‌పై దాడికి సిద్ధమవ్వడం, మరోవైపు ఏమండ్ టార్గెరియన్ తన భీకర డ్రాగన్ ‘వేగార్’తో ప్రతిదాడికి దిగడం వంటి సీన్స్‌‌‌‌ అభిమానులకు గూస్‌‌‌‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

‘సింహాసనం ఎవరిదో దేవుళ్లే నిర్ణయిస్తారు’ లాంటి డైలాగ్స్‌‌‌‌తో టార్గెరియన్ వంశస్థుల మధ్య సింహాసనం కోసం జరిగే అంతర్యుద్ధం, రాజకీయ కుతంత్రాలతో సీజన్‌‌‌‌ 3 ఏ స్థాయిలో ఉండబోతోందో అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ రాసిన ‘ఫైర్ అండ్ బ్లడ్’ నవల ఆధారంగా రూపొందుతోన్న ఈ సిరీస్, గత రెండు సీజన్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్  రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు సీజన్ 3 టీజర్‌‌‌‌తో సోషల్ మీడియాలో ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రెండింగ్‌‌‌‌లోకి వచ్చేసింది. జూన్ 22 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.