'పుష్ప' ఫ్రాంఛైజ్ తో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ఘన విజయం సాధించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పాన్-ఇండియా నుండి గ్లోబల్ స్టార్‌గా మార్చింది. ఈ విజయంతో ఏమాత్రం తగ్గకుండా, అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికపై పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 'జవాన్' ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'AA22 x A6' షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితేఈ సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. తన తదుపరి చిత్రం కోసం దేశంలోని టాప్ దర్శకులతో కలిసి పనిచేయడానికి అల్లు అర్జున్ తీవ్ర చర్చలు జరుపుతున్నట్లు సినీవర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది.
బన్నీ హాలీవుడ్ లోకి ఎంట్రీ
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ AA22 x A6 మెగా ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఇదొక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ప్రధానంగా సాగే సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీని 700 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సన్ పిక్చర్స్ వార్నర్ బ్రదర్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ప్రాజెక్ట్ స్థాయిని పెంచడానికి ఆస్కార్ అవార్డు గ్రహీత జస్టిన్ రేలీ (ఫ్రాక్చర్డ్ ఎఫ్‌ఎక్స్) సహా పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి అగ్ర నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. అంటే తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు కనిపించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భారీ చిత్రం 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ నెక్స్ట్ లైనప్..
'AA22 x A6' పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురు దర్శకులతో బన్నీ చర్చలు జరుపుతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ జోరుగా వినిపిస్తోంది. వారిలో దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ఒకరు. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB29' పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి, ఆ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడానికి ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ 'అల్లు అర్జున్ - జక్కన్న' కాంబినేషన్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్లాన్..
ఇక బాలీవుడ్ విజువల్ మాస్టర్ సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ గత ఏడాది కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఖరారైతే, ఇది భన్సాలీకి మొదటి తెలుగు చిత్రంగా, బన్నీకి హిందీ మార్కెట్లో మరింత పట్టు పెంచే చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరో వైపు 'కేజీఎఫ్', 'సాలార్' సినిమాలతో యాక్షన్ విజువల్స్‌కు కొత్త నిర్వచనం చెప్పిన ప్రశాంత్ నీల్ , బన్నీ మధ్య టాక్స్ నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం అల్లు అర్జున్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
'సరైనోడు 2'
బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'సరైనోడు' బ్లాక్ బస్టర్ గా నిలచింది. దానికి సీక్వెల్ గా 'సరైనోడు 2'ను తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొరటాల శివ గతంలో ప్రకటించి, వాయిదా పడిన వీరి కాంబోలో సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని, కొరటాల శివ తాజాగా బన్నీకి ఒక కథ వినిపించారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాల ఎంపికపై ఎంత పకడ్బందీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లైనప్ నిజమే అయితే 'పుష్ప 2: ది రూల్' తర్వాత భారతీయ సినిమా బాక్సాఫీస్‌పై అల్లు అర్జున్ ఆధిపత్యం ఇంకా చాలా కాలం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది వేచి చూడాలి...
