ఇంగ్లాండ్ గోల్ కీపర్ అద్బుత ప్రదర్శన..మ్యాచ్ డ్రా

ఇంగ్లాండ్ గోల్ కీపర్ అద్బుత ప్రదర్శన..మ్యాచ్ డ్రా

హాకీ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. 60 నిమిషాల ఆటలో రెండు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయితే ఒక్క గోల్ కూడా సాధించలేకపోవడంతో మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. 

మ్యాచ్ మొదలైన కాసేపటికే భార‌త ఆట‌గాడు హార్ధిక్ సింగ్  గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్ హార్దిక్ సింగ్ బంతులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సెకండాఫ్లో నూ టీమిండియాకు అనేక అవకాశాలు వచ్చాయి. పలు మార్లు ఇంగ్లాండ్ గోల్ పోస్టుపై దాడు చేసింది. కానీ  ఇంగ్లండ్ గోల్ కీప‌ర్ ఒలివ‌ర్ పైన్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.  పట్టుదల ప్రదర్శించి.. భారత ఆటగాళ్లు గోల్ చేయకుండా అడ్డుకున్నాడు. 

ఆట ముగిసే సమయానికి రెండు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయకపోవడంతో మ్యాచ్‌ డ్రా అయింది. దీంతో చెరో నాలుగు పాయింట్లు లభించాయి. ఇంగ్లండ్ గోల్ కీప‌ర్ ఒలివ‌ర్ పైన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  ప్రస్తుతం పూల్‌ Dలో ఇంగ్లాండ్‌ తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి.