భారత ఎకానమీకి కలిసొచ్చిన 2025.. వాణిజ్య ఒప్పందాల్లో జోరు.. రికార్డ్ కనిష్టాలకు తగ్గిన ద్రవ్యోల్బణం

భారత ఎకానమీకి కలిసొచ్చిన 2025.. వాణిజ్య ఒప్పందాల్లో జోరు.. రికార్డ్ కనిష్టాలకు తగ్గిన ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మిశ్రమంగా ఉన్నా, భారత ఎకానమీ మాత్రం 2025లో దూసుకుపోయింది. అమెరికా సుంకాలు పెరిగినప్పటికీ, రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డ్ కనిష్టాలకు దిగొచ్చింది. పన్ను వసూళ్లు పెరగడంతో ఆర్థిక లోటు కొంత తగ్గింది. యునైటెడ్ కింగ్ డమ్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎన్టీఏ), న్యూజిలాండ్, ఒమాన్లతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి.

4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం, భారత జీడీపీ 4,187 ట్రిలియన్డ్ డాలర్లకి చేరి జపాను అధిగమించింది. నాల్గో అతి పెద్ద ఆర్థిక వ్య వస్థగా ఎదిగింది. దేశీయంగా డిమాండ్ పెరగడం, పెట్టుబడులు వస్తుండడం, ప్రభుత్వ సంస్కరణలతో జీడీపీ పెరుగుతోంది.

కొనసాగిన వృద్ధి..

అమెరికా సుంకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ 6.6శాతం వృద్ధి అంచనాలతో ముందుకు సాగింది. జులై-సెప్టెంబర్ క్వార్టర్‎లో జీడీపీ 8.2శాతం పెరిగింది. పండుగల డిమాండ్, వినియోగం పెరగడం తోపాటు ప్రొడక్షన్ ఊపందుకోవడం కలిసొచ్చింది.

డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 8 శాతం అప్

నెట్ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రూ.17.04 లక్షల కోట్లకు చేరాయి. కిందటేడాది ఇదేటైమ్లో వచ్చిన రూ.15.78 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైంది. ఖర్చులు ఎక్కువైనా, ఆదాయం పెరగడంతో ఆర్థిక లోటు కొద్దిగా తగ్గింది. దీంతో వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి.

వాణిజ్య ఒప్పందాలు..

యూకేతో 2025 జులైలో సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని ఇండియా కుదుర్చుకుంది. ఈ దేశానికి వెళ్లే భారత ఎగుమతులపై జీరో టారిఫ్ పడనుంది. ఈఎన్టీఏ (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచ్టెన్స్టెస్టై న్)తో అక్టోబర్‎లో వాణిజ్య ఒప్పందాన్ని ఇండియా కుదుర్చుకుంది. రానున్న 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ దేశాల నుంచి వస్తాయని అంచనా. న్యూజిలాండ్ టారిఫ్‎ను తగ్గించుకోవడం, వాణిజ్యం, పెట్టుబడులు పెంచుకో పడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎన్టీఏ) ఒమాన్తో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పా నర్షిప్ అగ్రిమెంట్ (సీఈపీఏ) ని ఇండియ కుదుర్చుకుంది.

రూపాయి పతనం

అమెరికా సుంకాల కారణంగా 2025లో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 4-5శాతం పతనమైంది. జనవరిలో 86.23 నుంచి డిసెంబర్లో 91కి పడింది. ఈ 2022 తర్వాత అత్యంత బలహీన ప్రదర్శన.

గ్లోబల్ అంచనాలు..

వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓఈసీడీ, ఎస్ అం పీ గ్లోబల్ రేటింగ్స్ వంటి సంస్థలు ప్రస్తుత ఆర్థి సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి రేటు 6-శాతం నుంచి 6.7 శాతం మధ్య ఉంటుంద అంచనావేశాయి.