హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ టార్గెట్ 155 రన్స్

హర్మన్  ప్రీత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ టార్గెట్ 155 రన్స్

కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు..ఆసీస్ కు 155 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ టీమ్..20 ఓవర్లలో 8 వికెట్లకు 154 రన్స్ సాధించింది. ఓపెనర్లు స్మృతీ మందానా 24 పరుగులు చేయగా..షఫాలీ వర్మ 48 రన్స్ సాధించింది. యషికా బాటియా 8 పరుగులే చేసి నిరుత్సాహ పర్చింది. ఆ తర్వాత వచ్చిన రోడ్రిగ్వెస్, దీప్తి శర్మ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..కెప్టెన్ హర్మన్  ప్రీత్ కౌర్ దాటిగా ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 52 పరుగులు చేసి..భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ బౌలర్లలో  డార్కీ జెస్సీ జనాస్సెన్ 4  వికెట్లు తీసుకోగా..మెఘన్ షట్ రెండు వికెట్లు పడగొట్టింది. డార్కీ బ్రౌన్ ఒక వికెట్ దక్కించుకుంది.