ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. వరల్డ్ ఛాంపియన్ ఆసీస్ చేతిలో 3 వికెట్ల  తేడాతో పరాజయం పాలైంది. 155 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు..కేవలం 19 ఓవర్లలో 157 పరుగులు చేసి గెలిచింది.  43 పరుగులే 5 వికెట్లు కోల్పోయిన దశలో...గ్రేస్ హారిస్ జట్టును ఆదుకుంది. సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. కీలక సమయంలో ఆమె ఔటైనా..ఆష్లీ గార్డనర్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించింది. గార్డనర్ కు అలానా కింగ్ 18  పరుగులు చేసిన సహకరించింది.  భారత బౌలర్లలో  రేణుకా సింగ్ నాలుగు, దీప్తి శర్మ రెండు దక్కించుకుంది. 

అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు20 ఓవర్లలో 7 వికెట్లకు 154 రన్స్ సాధించింది. ఓపెనర్లు స్మృతీ మందానా 24 పరుగులు చేయగా..షఫాలీ వర్మ 48 రన్స్ సాధించింది. యషికా బాటియా 8 పరుగులే చేసి నిరుత్సాహ పర్చింది. ఆ తర్వాత వచ్చిన రోడ్రిగ్వెస్, దీప్తి శర్మ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..కెప్టెన్ హర్మన్  ప్రీత్ కౌర్ దాటిగా ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 52 పరుగులు చేసి..భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ బౌలర్లలో  డార్కీ జెస్సీ జనాస్సెన్ 4  వికెట్లు తీసుకోగా..మెఘన్ షట్ రెండు వికెట్లు పడగొట్టింది. డార్కీ బ్రౌన్ ఒక వికెట్ దక్కించుకుంది.