హైదరాబాద్‪లో సాకర్ కప్ సందడి.. ఇంటర్‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టోర్నమెంట్‌

హైదరాబాద్‪లో సాకర్ కప్ సందడి.. ఇంటర్‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టోర్నమెంట్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : చాన్నాళ్ల తర్వాత సిటీలో ఇంటర్నేషనల్ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ సందడి మొదలైంది. ఇంటర్‌‌‌‌‌‌‌‌ కాంటినెంటల్ కప్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్ టోర్నమెంట్‌‌‌‌ మంగళవారం గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం మొదలైంది. తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా, మారిషస్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో ఒక్క గోల్ నమోదవకుండా డ్రాగా ముగిసింది. 

చాన్నాళ్ల తర్వాత సిటీలో ఇంటర్నేషనల్ టోర్నీ జరగడం, దాదాపు 16 సంవత్సరాల తర్వాత హైదరాబాద్​లో ఇండియా సీనియర్ ఫుట్‌‌‌‌ బాల్‌‌‌‌ జట్టు ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌‌‌‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సాకర్ ఫ్యాన్స్‌‌‌‌, స్టూడెంట్స్‌‌‌‌ ఇండియా జెర్సీ వేసుకొని, త్రివర్ణ పతాకం ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఈ టోర్నీలో ఇండియా, మారిషస్‌‌‌‌తో పాటు సిరియా కూడా బరిలో నిలిచింది. శుక్రవారం సిరియా–మారిషస్‌‌‌‌ తలపడనుండగా, 9న సిరియాతో ఇండియా పోటీ పడనుంది. -