ది కేర‌ళ స్టోరీ ధియేట‌ర్ల ద‌గ్గ‌ర ఆందోళ‌న‌లు.. పోలీస్ సెక్యూరిటీలో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు

ది కేర‌ళ స్టోరీ ధియేట‌ర్ల ద‌గ్గ‌ర ఆందోళ‌న‌లు.. పోలీస్ సెక్యూరిటీలో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు

ఎన్నో వివాదాల నడుమ మే 5న "ది కేరళ స్టోరీ" ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్న నేపద్యంలో.. థియేటర్ దగ్గర భారీ బందోబస్త్ మధ్య సినిమాని ప్రదర్శించారు. ఆ రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష నేతలు థియేటర్ ముందు నిరసనలు చేపట్టారు. సినిమాలో కూడా చాలా వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఇక మొత్తంగా ఈ సినిమాలో కేరళని  ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న రాష్ట్రంగా  చూపించారని నాయకులు విమర్శిస్తున్నారు. తక్షణమే ఈ సినిమా ప్రధర్శనని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తమిళనాడు లో ఈ సినిమా విడుదల నేపధ్యంలో స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాగంగానే తమిళనాడులో కూడా ఈ సినిమాపై పెద్ద ఎత్తున  ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ ని తప్పుగా చూపించారని, దీంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సినిమా ప్రధర్శన నిలిపివేయాలని.. లేనడంటే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.  

ఇక ఈ సినిమా నిషేదించాలని హై కోర్టుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇద్దరి తరుపున వాదనలు విన్న కోర్టు.. ఈ సినిమాకి సెన్సార్ అప్రూవ్ ఇచ్చిందని. ఈ సమయంలో సినిమాని నిలిపివేయాలని కోరడం సరికాదని తీర్పు ఇచ్చింది. దీంతో.. అక్కడ సినిమా రిలీజ్ కి లైనే క్లియర్ అయ్యింది. ఇక సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో జోఖ్యం చేసుకోలేమని చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ఏమైనా ఉంటే నిర్మాత చూసుకుంటాడాని చెప్పుకొచ్చింది. ఇక కేరళలో  తెప్పిపోయిన 32000 మంది అమ్మాయిల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తప్పిపోయిన ఆ ఆమ్మాయిలని బాలవంతగా మతం మార్పించి ఉగ్రవాదులు చేస్తున్నారు అనెల సినిమాలో సన్నివేశాలు ఊదటంతో ఈ సినిమాపై వివాదాలు రాజుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మే5న ప్రేక్షకుల ముందుకి వచ్చిన నేపధ్యంలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి.