దేవుడి భూములను మింగేసింది టీఆర్ఎస్ నేతలే

దేవరయాంజాల్‌‌ భూములు పరిశీలించిన రేవంత్​
కేటీఆర్, మల్లారెడ్డి కబ్జాలు కమిటీకి కనిపించలేదా అని ప్రశ్న?

హైదరాబాద్, వెలుగు: దేవరయాంజాల్‌‌లోని రాములోరి భూములను టీఆర్ఎస్ నేతలే మింగేశారని, కబ్జా చేసిన భూములన్నీ కేటీఆర్, మల్లారెడ్డి, కేసీఆర్ బంధువుల ఆధీనంలోనే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీతారామ స్వామి ఆలయ భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్‌‌లో కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో కలిసి రేవంత్‌‌ గురువారం పర్యటించారు. ఆలయ భూముల్లో కట్టిన అక్రమ కట్టడాలను పరిశీలించారు. దేవుడి మాన్యాలన్నీ ఆక్రమించి మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి అక్రమ భవనాలు, ఫాంహౌస్​లను నిర్మించారని మండిపడ్డారు. ఆలయానికి సంబంధించిన 1,531 ఎకరాల భూమి 1925 నుంచి ఇప్పటివరకు ఎవరెవరి చేతుల్లోకి మారిందో బయటపెట్టాలన్నారు. ఈటలకు చెందిన అక్రమ నిర్మాణాలపైనే ఐఏఎస్‌‌ల కమిటీ దృష్టి పెట్టిందని, అదే భూముల్లో ఉన్న కేసీఆర్ దగ్గరి బంధువులు, మంత్రుల అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు పోలేదని ప్రశ్నించారు. 
గ్రేటర్‌‌ చుట్టూ ఎన్ని ఉన్నాయో?
దేవుడి భూములను పరిరక్షించాలనే చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని రేవంత్‌‌ డిమాండ్‌‌ చేశారు. కేసీఆర్ దగ్గరి బంధువు, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌‌రావు నేతృత్వంలోని ఐఏఎస్‌‌ల కమిటీకి బాధ్యతలు అప్పగించడంలోనే అసలు మతలబు ఉందని అన్నారు. ‘రాజకీయ కోణంలోనే ప్రభుత్వం కమిటీ వేసింది. మన్యం భూములకు చెందిన సర్వే నెం. 437లోనే కేసీఆర్‌‌కు చెందిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉన్నాయి. అక్కడి నుంచే ప్రింటింగ్ అవుతోంది. రక్షణ శాఖ రూల్స్‌‌ను ఉల్లంఘించి 45 ఫీట్ల ఎత్తు వరకు బిల్డింగులు కట్టారు’ అని ఆరోపించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న దేవరయాంజాల్ గ్రామంలో 160 అక్రమ కట్టడాలను ఐఏఎస్ ల కమిటీ గుర్తించిందని చెబుతున్నారని.. వాటికి సీఎస్ సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహించాలని రేవంత్‌‌ అన్నారు. ‘ఈ ఒక్క గ్రామంలోనే ఇన్ని ఇల్లీగల్ భవనాలుంటే గ్రేటర్ చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలెన్నో లెక్క తేల్చాలి’ అని డిమాండ్‌‌ చేశారు. 
కేటీఆర్‌‌ నాయకత్వంలో గ్రేటర్‌‌ చుట్టూ రియల్‌‌ మాఫియా
దేవరయాంజాల్‌‌లోని సర్వే నెం. 212 నుంచి 218 సర్వే నెంబర్లలోని 84 ఎకరాల భూమిని కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్‌‌రావు ఆక్రమించి శ్రీని డెవలపర్స్ పేరిట అమ్ముకున్నారని రేవంత్ చెప్పారు. ఈ భూములు 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ప్రశ్నించారు. ముందుగా శామీర్‌‌పేట సబ్‌‌ రిజిస్ట్రార్‌‌పై కేసు పెట్టాలన్నారు. దేవరయాంజాల్‌‌లోని సర్వే నెం.657లో మంత్రి మల్లా రెడ్డి బామ్మరిది శ్రీనివాస్‌‌రెడ్డి ఫామ్ హౌస్ కట్టారని, శ్రీనివాస్‌‌రెడ్డి భార్య లక్ష్మి.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీకి చైర్మన్‌‌గా ఉన్నారని చెప్పారు. గతంలో జీవో నెం. 111 భూములలో కేటీఆర్ అక్రమంగా ఫాంహౌజ్ కట్టారని బయటపెడితే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా చెలామణిలో ఉందని ఆరోపించారు. కరోనా టైం చూసి కేటీఆర్, ఆయన సన్నిహితులు వందల ఎకరాల వ్యవసాయ భూములను చదును చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న భూ ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుందని రేవంత్‌‌ చెప్పారు. 
ఆక్రమ కట్టడాల పరిశీలన
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ విప్ అనిల్, ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్‌‌రెడ్డి, తుర్కపల్లి వేణుగోపాల్‌‌రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి దేవరయాంజాల్ భూముల్లో రేవంత్‌‌ గురువారం సాయంత్రం పర్యటించారు. అంతకుముందు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రింటింగ్ ప్రెస్‌‌లను పరిశీలించారు. రేవంత్ పర్యటన ఉందని ఆ రెండు బిల్డింగుల గేట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. గంటపాటు పర్యటించిన కమిటీ సభ్యులు మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి బంధువులైన మర్రి రాజశేఖర్ రెడ్డి, బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి ఆక్రమ కట్టడాలను పరిశీలించారు. తిరిగి వెళ్లిపోయే ముందు దేవరయాంజాల్ సీతారామ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవుడి భూములను మింగేసిన వారిని శిక్షించాలని, ఆ భూములను వెనక్కి వచ్చేలా చూడాలని రాములోరిని కోరినట్లు రేవంత్ తెలిపారు.

ఆలయానికి సంబంధించిన 1,531 ఎకరాల భూమి 1925 నుంచి ఇప్పటివరకు ఎవరెవరి చేతుల్లోకి మారిందో బయటపెట్టాలన్నారు. ఈటలకు చెందిన అక్రమ నిర్మాణాలపైనే ఐఏఎస్‌‌ల కమిటీ దృష్టి పెట్టిందని, అదే భూముల్లో ఉన్న కేసీఆర్ దగ్గరి బంధువులు, మంత్రుల అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు పోలేదని ప్రశ్నించారు. 
గ్రేటర్‌‌ చుట్టూ ఎన్ని ఉన్నాయో?
దేవుడి భూములను పరిరక్షించాలనే చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని రేవంత్‌‌ డిమాండ్‌‌ చేశారు. కేసీఆర్ దగ్గరి బంధువు, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌‌రావు నేతృత్వంలోని ఐఏఎస్‌‌ల కమిటీకి బాధ్యతలు అప్పగించడంలోనే అసలు మతలబు ఉందని అన్నారు. ‘రాజకీయ కోణంలోనే ప్రభుత్వం కమిటీ వేసింది. మన్యం భూములకు చెందిన సర్వే నెం. 437లోనే కేసీఆర్‌‌కు చెందిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉన్నాయి. అక్కడి నుంచే ప్రింటింగ్ అవుతోంది. రక్షణ శాఖ రూల్స్‌‌ను ఉల్లంఘించి 45 ఫీట్ల ఎత్తు వరకు బిల్డింగులు కట్టారు’ అని ఆరోపించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న దేవరయాంజాల్ గ్రామంలో 160 అక్రమ కట్టడాలను ఐఏఎస్ ల కమిటీ గుర్తించిందని చెబుతున్నారని.. వాటికి సీఎస్ సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహించాలని రేవంత్‌‌ అన్నారు. ‘ఈ ఒక్క గ్రామంలోనే ఇన్ని ఇల్లీగల్ భవనాలుంటే గ్రేటర్ చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలెన్నో లెక్క తేల్చాలి’ అని డిమాండ్‌‌ చేశారు. 
కేటీఆర్‌‌ నాయకత్వంలో గ్రేటర్‌‌ చుట్టూ రియల్‌‌ మాఫియా
దేవరయాంజాల్‌‌లోని సర్వే నెం. 212 నుంచి 218 సర్వే నెంబర్లలోని 84 ఎకరాల భూమిని కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్‌‌రావు ఆక్రమించి శ్రీని డెవలపర్స్ పేరిట అమ్ముకున్నారని రేవంత్ చెప్పారు. ఈ భూములు 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ప్రశ్నించారు. ముందుగా శామీర్‌‌పేట సబ్‌‌ రిజిస్ట్రార్‌‌పై కేసు పెట్టాలన్నారు. దేవరయాంజాల్‌‌లోని సర్వే నెం.657లో మంత్రి మల్లా రెడ్డి బామ్మరిది శ్రీనివాస్‌‌రెడ్డి ఫామ్ హౌస్ కట్టారని, శ్రీనివాస్‌‌రెడ్డి భార్య లక్ష్మి.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీకి చైర్మన్‌‌గా ఉన్నారని చెప్పారు. గతంలో జీవో నెం. 111 భూములలో కేటీఆర్ అక్రమంగా ఫాంహౌజ్ కట్టారని బయటపెడితే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా చెలామణిలో ఉందని ఆరోపించారు. కరోనా టైం చూసి కేటీఆర్, ఆయన సన్నిహితులు వందల ఎకరాల వ్యవసాయ భూములను చదును చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న భూ ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుందని రేవంత్‌‌ చెప్పారు. 
అక్రమ కట్టడాల పరిశీలన