సినిమాకి భాష, ప్రాంతీయ భేదం వంటివి ఉండవు. ఎందుకంటే సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఆదరిస్తారు. అయితే పాకిస్థాన్ దేశంలో పెద్ద హిట్ అయిన "ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్" చిత్రాన్ని భారత్ లో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ చిత్రంలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఫవాద్ ఖాన్ మరియు మహిరా ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రానికి పాకిస్తానీ డైరెక్టర్ బిలాల్ లషరీ దర్శకత్వం వహించగా, అసద్ ఖాన్ మరియు అమ్మర హిక్మట్ కలసి సంయుక్తంగా నిర్మించారు.
లవ్ మరియు యాక్షన్ ఓరియేంటేడ్ తరహాలో తెరకెక్కించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతేగాకుండా రూ.400 కోట్లు కలెక్ట్ చేసి రూ.100 కోట్ల కలెక్ట్ చేసిన తొలి పాకిస్తాన్ సినిమాగా రికార్డులకెక్కింది.
ALSO READ | అన్ని సినిమాల రికార్డులు బ్రేక్..ఇండియన్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే
అయితే మౌలా జట్ చిత్రాన్ని భారత్ లో అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా జీ స్టూడియో సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా షేర్ చేశారు. మరి పాకిస్తాన్ లో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం భారత్ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.