V6 News

ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన లారీ.. ఒకరు సజీవదహనం

ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన లారీ..  ఒకరు సజీవదహనం


మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఎస్ బీఐ బ్యాంక్ ముందు ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ టేక్ చేయబోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది లారీ. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకున్న లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.  రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు