బంగ్లాదేశ్ లో అతితక్కువ కేసులు.. ఎంతంటే

బంగ్లాదేశ్ లో అతితక్కువ కేసులు.. ఎంతంటే
  • 1159 కొత్త కేసులు.. 40 మంది మరణాలు

ఢాకా: మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లో అతితక్కువ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో  అతి తక్కువగా 1159 కొత్త కేసులు నమోదు కాగా.. 40 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైన తర్వాత అతి తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు. బంగ్లాదేశ్ శాంపిల్ పాజిటివిటీ రేటు 7.45 శాతం నమోదు అవుతోంది. దీంతో ఒకింత ఆందోళనకు గురైన బంగ్లాదేశ్ కు చైనా ఆపన్న హస్తం అందించింది. 5 లక్షల డోస్‌ల సినోఫామ్‌ వ్యాక్సిన్లను చైనా బంగ్లాదేశ్ కు  బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానం ఉండడంతో తొలుత తీసుకునేందుకు బంగ్లాదేశ్ అంగీకరించలేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం ప్రకటించడంతో ధైర్యంగా వినియోగించడం ప్రారంభించామని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మెమన్ తెలిపారు. చైనా పంపిన వ్యాక్సిన్లు ఇవాళే బంగ్లాదేశ్ కు అందాయి..  త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ను బంగ్లాలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.