వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కే మొగ్గు!

వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కే మొగ్గు!


మైక్రోసాఫ్ట్​ కంపెనీ ఇండియాలో నిర్వహించిన సర్వేలో మన దేశంలోని ఉద్యోగులు వర్క్​ఫ్రమ్​ హోమ్​కే ఓటేస్తుంటే, గ్లోబల్​గా​ మాత్రం వారంలో రెండు, మూడుసార్లయినా ఆఫీసులకెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. ఒకే రోజు విడుదలైన రెండు సర్వేలలో ఈ విషయం తేలింది. కాకపోతే, ఇతర దేశాలలోని ఉద్యోగులు కూడా ఫ్లెక్సిబిలిటీని ఇష్టపడుతున్నారు. ఆఫీసుల తీరుతెన్నులను  కూడా ఉద్యోగుల ఇష్టాలకు అనుగుణంగా కంపెనీలు మార్చేస్తున్నట్లు ఈ సర్వేలు తేలుస్తున్నాయి. 

న్యూఢిల్లీ: వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానంలో పనిచేసేందుకు మెజార్టీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా చేసిన సర్వేలో  ఈ విషయం తేలింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని 74 శాతం మంది ఉద్యోగులు ఫ్లెక్సిబుల్‌‌‌‌గా ఉండే రిమోట్ వర్కింగ్‌‌‌‌ విధానానికి మొగ్గుచూపుతున్నారు. ఇండియాలోని వర్క్ ట్రెండ్‌‌‌‌ను అంచనావేయడానికి మైక్రోసాఫ్ట్ ఈ సర్వే చేసింది. మొదటిసారిగా యాన్యువల్ వర్క్‌‌‌‌ ట్రెండ్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ను రిలీజ్ చేసింది. ఇండియాలో వర్క్ విధానం భవిష్యత్‌‌‌‌లో ఎలా మారుతుంది, అంచనాలు, సమస్యలు వంటి అంశాలను విడుదల చేసింది. రిమోట్ వర్కింగ్‌‌‌‌ (ఆఫీస్‌‌‌‌కు బయట పనిచేయడం) పై ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, 73 శాతం మంది ఉద్యోగులు తమ టీమ్‌‌‌‌మేట్స్‌‌‌‌ను మిస్ అవుతున్నారని ఈ సర్వే తెలిపింది. ఆఫీస్‌‌‌‌ స్పేస్‌‌‌‌ను డీజైన్ చేసి హైబ్రిడ్ వర్కింగ్ విధానానికి తగ్గట్టు మార్చాలని 73 శాతం కంపెనీలు చూస్తున్నాయని  పేర్కొంది. ‘కరోనా తర్వాత ఫ్లెక్సిబులిటీ ఎక్కువగా ఉన్నా రిమోట్‌‌‌‌ వర్కింగ్, హైబ్రిడ్ వర్క్‌‌‌‌ విధానాలకు ఆదరణ ఉంటుందని ఈ డేటా ద్వారా తెలుస్తోంది’ అని ఈ రిపోర్ట్ అంచనావేసింది. 

ఉద్యోగుల్లో మార్పొస్తోంది..

‘కిందటేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఒక్క విషయం అర్థమవుతుంది. వర్క్‌‌‌‌ విధానంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా పనిచేస్తున్నామనే సాంప్రదాయ వర్క్‌‌‌‌ విధానాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. రిమోట్ వర్క్ విధానం వలన కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయని, ముందు ముందు సమస్యలు కూడా ఎదురవుతాయని  ఈ వర్క్ ట్రెండ్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ చెబుతోంది. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో హైబ్రిడ్ వర్క్ విధానం డామినేట్ చేస్తుంది. విజయవంతమైన హైబ్రిడ్ స్ట్రాటజీకి ఫ్లెక్సిబులిటీ ఎక్కువగా ఉండడం కీలకం’ అని మైక్రోసాఫ్ట్‌‌‌‌  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ రాజివ్‌‌‌‌ సోది అన్నారు. ఈ సర్వే ప్రకారం..రిమోట్ వర్కింగ్ విధానం వలన ఉద్యోగుల్లో మానవత్వం పెరుగుతోంది. అథెంటిక్‌గా మారుతున్నారు. కిందటేడాది కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే టైమ్‌‌‌‌లో ఉద్యోగులు ఒకరికి ఒకరు కొత్త మార్గాలలో  ధైర్యం చెప్పుకున్నారని ఈ సర్వే పేర్కొంది. ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ఒకరు (24 శాతం)  కష్ట సమయల్లో కొలీగ్‌‌‌‌ ముందు ఏడ్చారని, తమ ఇళ్లల్లో ఎలా ఉంటుందో ఇతర ఉద్యోగులకు తెలపడంపై 35 శాతం మంది సిగ్గుపడలేదని ఈ సర్వే తెలిపింది. ఉద్యోగులు లివింగ్ రూమ్స్‌‌‌‌  వర్క్ మీటింగ్‌‌‌‌ కోసం రెడీ అవుతున్నాయని, 37 శాతం మంది ఉద్యోగులు తమ కొలీగ్ ఫ్యామిలీస్‌‌‌‌ను కలిశారని పేర్కొంది.  

జాబ్‌‌‌‌ మారతాం..

గత ఏడాది కాలంలో ఉద్యోగి పెర్ఫార్మెన్స్‌‌‌‌ సేమ్‌‌‌‌ లేదా పెరగడమో జరిగిందని మైక్రోసాఫ్ట్ సర్వే అంచనావేసింది. కానీ, ఉద్యోగిపై ఒత్తిడి ఎక్కువయ్యిందని పేర్కొంది.  కంపెనీలు ఎక్కువగా పనిచేయాలని అడుగుతున్నాయని 62 శాతం మంది రెస్పాండెంట్లు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కంపెనీలు అస్సలు  పట్టించుకోవడం లేదని 13 శాతం రెస్పాండెంట్లు చెప్పారు. ఓవర్‌‌‌‌‌‌‌‌ వర్క్ చేస్తున్నామని 57 శాతం మంది, విసిగిపోయామనే ఫీలింగ్‌‌‌‌ను 32 శాతం మంది వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో లింక్డిన్‌‌‌‌లో రిమోట్‌‌‌‌ జాబ్‌‌‌‌ పోస్టింగ్‌‌‌‌లు ఐదు రెట్లు పెరిగాయి. ఈ ఏడాది జాబ్‌‌‌‌ మారాలనే ఆలోచనను 62 శాతం మంది వ్యక్తం చేశారు. 

తిరిగి ఆఫీస్‌‌‌‌లకు ..

గ్లోబల్‌‌‌‌గా ప్రతి ఐదు మంది ఉద్యోగుల్లో నలుగురు తిరిగి ఆఫీస్‌‌‌‌కు వెళ్లాలనుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది. స్పేస్‌‌‌‌ మాట్రిక్స్ ఇండియా, యూఎస్, చైనా, సింగపూర్‌‌‌‌‌‌‌‌లలోని 1000 మందికి పైగా ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొంది.  ఈ సర్వే ప్రకారం  కంపెనీలు తమ ఆఫీస్‌‌‌‌లను హైబ్రిడ్ వర్క్ విధానానికి అనుకూలంగా రీడిజైన్ చేస్తున్నాయి. 85 శాతం ఉద్యోగులు  వారానికి రెండు– మూడు రోజులైన ఆఫీస్‌‌‌‌కు వెళ్లాలనుకుంటున్నారు. కరోనా సంక్షోభానికి ముందు 64 శాతం మంది ఉద్యోగులకు రిమోట్‌‌‌‌గా వర్క్‌‌‌‌ చేయడంలో కొద్దిగా అనుభవముందని ఈ సర్వే పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌ వలన ఓవర్‌‌‌‌‌‌‌‌ వర్క్ చేస్తున్నట్టు 30 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారని, ఫేస్‌‌‌‌ టూ ఫేస్ ఇంటరాక్షన్స్‌‌‌‌ను మిస్ అవుతున్నామని 43 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారని ఈ సర్వే తెలిపింది. మొత్తం వర్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ను కంపెనీలు  ఒకేసారి ఆఫీస్‌కు రమ్మనమని అభిప్రాయపడింది.