వినాయక విగ్రహాల తయారీ.. కుమ్మరి సంఘాలకు ప్రత్యేక శిక్షణ

వినాయక విగ్రహాల తయారీ.. కుమ్మరి సంఘాలకు ప్రత్యేక శిక్షణ

ఉమ్మడి మెదక్ జిల్లాలో మట్టి వినాయకుల విగ్రహాల తయారీ ప్రారంభమైంది. ఇప్పటికే పంపిణీ కోసం ఐదు వేల విగ్రహాలు రెడీ అయ్యాయి. మెదక్, తుఫ్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలో ఉచితంగా విగ్రహాలను పంపిణీకి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలోనూ మునిసిపాలిటీల వారిగా  విగ్రహాలను పంపిణి చేయనున్నారు. 8 ఇంచుల మట్టి వినాయక విగ్రహాల తయారీ కోసం సంగారెడ్డి జిల్లాకు చెందిన  కుమ్మరి సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు జిల్లా కలెక్టర్. వచ్చే 10 పండుగ రోజు నాటికి మెదక్ జిల్లాకు మొత్తం ఆరు వేల విగ్రహాలను అందివ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణ పరీరక్షణతో పాటు కుమ్మరిలకు ఉపాధి దొరుకుతుందంటున్నారు అధికారులు.