వడ్డీ డబ్బులు చెల్లించలేదని కత్తులతో దాడి 

వడ్డీ డబ్బులు చెల్లించలేదని కత్తులతో దాడి 

రంగారెడ్డి: వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఓ వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన బండ్లగూడ జారీర్ కార్పొరేషన్ పరిధి, మల్లికార్జున్ నగర్ కాలనీలో జరిగింది. ఈ కాలనీలో ఉండే మేరీ అనే మహిళకు వినోద్ సింగ్ అనే వ్యక్తి రూ.5 లక్షలను వడ్డీకి ఇచ్చాడు. అయితే గత నాలుగు నెలల నుంచి వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడంతో మేరీ కుటుంబీకులపై వినోద్ కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో మేరీ తల్లి, కుమారుడికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. వినోద్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.