‘ఫుడ్​ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్ ప్రారంభం

‘ఫుడ్​ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్ ను సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఈ మొబైల్​వ్యాన్​ల ద్వారా అధికారులు రోజూ వాడే ఆహార పదార్థాల్లోని నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తారని, కల్తీ నివారణకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. వ్యాన్​లో డిజిటల్ బ్యాలెన్స్, డిజిటల్ మల్టీ పారా మీటర్, హ్యాండ్ మిల్లీ మీటర్(పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీఫ్యాక్టో మీటర్ పోర్టబుల్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్కీనింగ్, మిక్సర్ గ్రైండర్ ఉంటాయని తెలిపారు. ఫుడ్ స్టోరేజీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ వ్యాన్ లో ఉంటారని చెప్పారు.

స్ట్రీట్ వెండర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వాడుతున్న ఆహార పదార్థాలలను తరచూ తనిఖీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల టెస్టింగ్ ను పరిశీలించారు. రోజుకో సర్కిల్ లో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎస్ఓలు మొదటగా వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫుడ్​క్వాలిటీలో అనుమానం ఉంటే వెంటనే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040–-21111111కు కాల్​చేసి ఫిర్యాదు చేయొచ్చని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్  బి.సంతోశ్, డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు సుదర్శన్ రెడ్డి, మూర్తిరాజు, ఎఫ్ఎస్ఓలు ప్రీతి, శృతి తదితరులు పాల్గొన్నారు.