టీ హబ్ కొత్త బ్లాక్ లో త్రీడీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్

టీ హబ్ కొత్త బ్లాక్ లో త్రీడీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్

హైదరాబాద్ : తెలంగాణలో వైద్యరంగం టాప్ లో ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతీ రంగంలోనూ తెలంగాణ ముందుందన్నారు. స్కిల్స్, స్టార్టప్స్, అకాడమీ, టాస్క్, గేమింగ్, టెక్నాలజీలో హైదరాబాద్ కి మంచి గ్రోత్ ఉందన్నారు. త్రీడీ ప్రింటింగ్ అందరికీ అందుబాటులోకి వస్తే వైద్యరంగంపై ఉన్న అపోహలకు సొల్యూషన్ దొరుకుతుందన్నారు. మెడికల్ డివైస్ అండ్ ఇంప్లాంట్స్ లో త్రీడీ ప్రింటింగ్ పై.. హైదరాబాద్ హైటెక్ సిటీలో నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ హెల్త్ టెక్నికల్ డివైసెస్ ను ప్రదర్శనగా పెట్టారు.

వైద్యరంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగపడుతుందని చెప్పారు. త్రీడీ ప్రింటింగ్ అభివృద్ధికి సంబంధించి పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఉస్మానియా యూనివర్శిటీలో నేషనల్ సెంటర్ ఫర్ అడెటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

విభజన హామీలతో తెలంగాణకు రండి..

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు