కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం

కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం

రాష్ట్రంలోకి  మళ్లీ కుట్రదారులు వచ్చారని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేని కొందరు..మళ్ళీ ఆంధ్రాలో కలుపుతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గతంలో అస్తవ్యస్థంగా ఉన్న రోడ్లను పట్టించుకునేవారే లేరని..కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందన్నారు.
ప్రజాసంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు క్లీన్ అండ్ గ్రీన్ గా మారుతాయన్నారు మంత్రి. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ లో 24 గంటలు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అనేక పార్కులతో పాటు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మెడికల్ కళాశాల, ఐటీ టవర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ నగరంగా కరీంనగర్ ను తీర్చదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో నీరు, కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం

వంద రోజుల యుద్ధం..ఎన్నో బతుకులు శిథిలం

రాహుల్ కు ఈడీ మరోసారి సమన్లు