26న లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌

26న లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో ఈ నెల 26న నేషనల్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ లీగల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ అథారిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. కోర్టులో పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉన్న అన్ని రకాల రాజీపడదగిన సివిల్‌‌‌‌‌‌‌‌, కాంపౌండబుల్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు, ప్రీ లిటిగేషన్‌‌‌‌‌‌‌‌ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ దగ్గరలోని కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.