జూ పార్కులో ఇప్పటి వరకు అడాప్ట్ అయిన యానిమల్స్ సంఖ్య 235

జూ పార్కులో ఇప్పటి వరకు అడాప్ట్ అయిన యానిమల్స్ సంఖ్య 235
  •     జూ పార్కులో ఇప్పటి వరకు అడాప్ట్ అయిన యానిమల్స్ సంఖ్య 235
  •     వీటిలో పక్షులే అధికం

హైదరాబాద్, వెలుగు: జంతువుల దత్తతపై సిటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. జూ పార్క్‌‌కి వెళ్లినవారు జంతువులు, పక్షలను చూసి.. తమకు నచ్చిన యానిమల్స్‌‌   సంరక్షణ బాధ్యతను తీసుకునేందుకు ముందుకి వస్తున్నారు. ఆపై వాటికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. సిటీలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో దాదాపు 2 వేలకు పైగా జంతువులు, పక్షులు ఉన్నాయి. వీటి సంరక్షణకు సంబంధించి 2002లో యానిమల్ అడాప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. 2010 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జూ పార్కుకు వెళ్లిన వారు నచ్చిన జంతువుల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దత్తత తీసుకుని యానిమల్ ఎన్‌‌క్లోజర్ ముందు జంతువు తాలూకూ వివరాలతో పాటు తమ పేరుని కూడా చూసుకునేందుకు ముచ్చట పడుతున్నారు.

3  నెలల నుంచి ఏడాది వరకు..

ప్రతి రోజూ వేల మంది నెహ్రూ జూ పార్కును సందర్శిస్తుంటారు. హాలీడేస్‌‌లో, స్పెషల్ అకేషన్లలో మరింత ఎక్కువగా ఉంటుంది. అలా వెళ్తున్న వారు ఎన్‌‌క్లోజర్ల బయట దాతల పేర్లను చూసి తాము కూడా బాధ్యత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా అడాప్ట్‌‌ చేసుకుంటున్న వారిలో సెలబ్రిటీలు, కార్పొరేట్ కంపెనీలు, విద్యాసంస్థలతో పాటు  కామన్ పీపుల్ కూడా ఉంటున్నారు. సందర్శకులు జూలో తమకు నచ్చిన యానిమల్ గురించి అధికారులకు తెలిపి వారి నుంచి సంరక్షణకు సంబంధించిన వివరాలను తెలుసుకుని అడాప్ట్ చేసుకుంటున్నారు. జంతువులు, పక్షులను మూడు నెలల నుంచి ఏడాది వరకు దత్తత తీసుకోవచ్చు.

అలా దత్తత తీసుకున్న వాటికి అయ్యే ఖర్చును అధికారులకు అందించడం ద్వారా వాటి సంరక్షణ చూసుకునే అవకాశం ఉంటుంది.పెరుగుతున్న అవగాహన..జూ పార్కులోని ఎన్​క్లోజర్ల వద్ద బోర్డుపై అధికారులు దత్తత తీసుకున్న వారి పేర్లను ఉంచుతున్నారు. వాటిని చూసిన చాలా మందికి అవగాహన ఏర్పడి వారు సైతం అడాప్ట్ చేసుకుంటున్నారు. దత్తత తీసుకున్న వారికి తమ కుటుంబ సభ్యులతో రెండు సార్లు ఉచితంగా జూపార్కుకి వచ్చే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. పక్షులను అడాప్ట్ చేసుకునేందుకు ఎక్కువగా ఆస్తి చూపుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 235 జంతువులు అడాప్ట్‌‌ అయ్యాయని జూ అధికారులు చెప్తున్నారు. 2020 నుంచి 2021 మార్చి వరకు 150 యానిమల్స్ అడాప్షన్ అవగా.. రానురాను ఈ సంఖ్య పెరుగుతోందని జూ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత మంది ముందుకు రావాలి

సందర్శకుల నుంచి ఆదరణ పెరుగుతోంది. వస్తున్నవారు అక్కడ ఏర్పాటు చేస్తున్న బోర్డ్‌‌లను చూసి సంప్రదిస్తున్నారు. వారికి నచ్చిన పక్షులు, జంతువుల సంరక్షణ బాధ్యత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారు తీసుకున్న టైం పీరియడ్‌‌లో ఇచ్చిన అమౌంట్‌‌తో వాటి మెయింటెనెన్స్ చేస్తున్నాం. దత్తత కోసం మరింత మంది ముందుకు రావాలి  – ఎస్. రాజశేఖర్, క్యూరేటర్, నెహ్రూ జూపార్క్