ఇన్‌స్టాలో కోహ్లీయే కింగ్‌

ఇన్‌స్టాలో కోహ్లీయే కింగ్‌

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకున్న క్రేజ్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి ప్రూవ్‌ అయ్యింది. ఇన్‌స్టాలో విరాట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏడున్నర కోట్లను దాటేసింది. ఈ మార్కు దాటిన తొలి ఏషియన్‌ సెలబ్రెటీగా నిలిచాడు. అంతేకాక, ఫుట్‌బాల్‌ లెజెండ్స్ ‌‌క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, నేమర్‌ జూనియర్‌ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లుఉన్న అథ్లెట్‌గాను ఘనత సాధించాడు. ఆసియా విషయానికొస్తే ఇన్‌స్టా ఫాలోవర్ల విషయంలో మరే సెలబ్రెటీ విరాట్‌ దరిదాపుల్లో లేరు. ప్రియాంక చోప్రా(56 మిలియన్లు), దీపికా పదుకోన్(52 మిలియన్లు) వరుసగా కోహ్లీ తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు.

నేటి నుంచి ఆర్‌సీబీ ట్రెయినింగ్‌

విరాట్‌ కోహ్లీసారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్ ‌‌బెంగళూరు(ఆర్‌‌సీబీ) జట్టు ట్రెయినింగ్‌ క్యాంప్ గురువారం నుంచి మొదలు కానుంది. ఆర్‌‌సీబీ టీమ్ ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ బుధవారంతో ముగియనుంది. దీంతో జట్టుమొత్తంమూడు వారాల ట్రెయినింగ్‌ క్యాంప్‌లో పాల్గొననుంది. ఇక్కడి ఐసీసీ క్రికెట్‌ అకాడమీలో జరిగే ఈ క్యాంప్‌ పూర్తి బయోసెక్యూర్‌ ఎన్విరాన్మెంట్‌లో జరగనుంది. ఈ క్యాంప్ కోసం ఆర్‌‌సీబీ క్రికెట్‌ ఆపరేషన్స్ ‌‌డైరెక్టర్స్‌‌ మైక్ ‌హెస్సన్‌, హెడ్‌‌కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ఇప్పటికే ప్లాన్స్‌‌ రెడీ చేశారు. లాక్‌డౌన్‌ వల్లకొంతకాలంగా ప్లేయర్లంతా ఆటకు దూరంగా ఉండడంతో ప్రతిఒక్కరిపై ప్రత్యేక దృష్టిసారించనున్నామని హెస్సన్ తెలిపాడు. ఆటగాళ్లు గాయపడకుండా నెమ్మదిగా ట్రెయినింగ్‌ లెవెల్‌ను నెమ్మదిగా పెంచుతూ లీగ్‌టైమ్‌కు అందరినీ సిద్ధం చేస్తామని కోచ్‌ కటిచ్‌ పేర్కొన్నాడు. ఒక్కసారి అందరూ టచ్‌లోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి ట్రెయినింగ్‌ ప్రారంభిస్తామని కటిచ్‌ చెప్పుకొచ్చాడు.

చెమటోడ్చిన విరాట్‌
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13 కోసం రాయల్స్‌ చాలెంజర్స్ ‌‌బెంగళూరు(ఆర్‌‌సీబీ) కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఓ రేంజ్‌లో రెడీ అవుతున్నాడు. టీమ్‌తో కాకుండా స్పెషల్‌ ఫ్లైట్‌లో దుబాయ్‌ వెళ్లిన విరాట్‌.. అక్కడి ఓ హోటల్‌లో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఫిట్‌‌నెస్‌‌కు అత్యంత ప్రాధాన్య మిచ్చే కోహ్లీ.. తన రూమ్‌ బాల్కనీలో వర్కౌట్స్ చేస్తున్నాడు. పుషప్స్‌‌తో పాటు వెయిట్స్‌‌తో పలు ఎక్స్‌‌ర్‌సైజ్‌లు చేసి చెమటలు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌‌సీబీ టీమ్‌ బుధవారం సోషల్‌మీడియాలో పెట్టింది.