
మానవపాడు, వెలుగు : ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా గర్భిణులు, చిన్నారులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం పందుల పాలవుతోంది. అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, ఉండవెల్లి, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని మండల కేంద్రంలోని గోదాంలో నిల్వ ఉంచుతున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉండే ఈ గోదాం నుంచే బాలామృతం, పాల ప్యాకెట్లు అంగన్‌వాడీలకు పంపిస్తారు. కానీ, ఆఫీసర్లు వీటిని పట్టించుకోకపోవడంతో పాడైపోయాయి. గోదామ్‌కు ఉన్న షట్టర్‌కు కూడా కొంతమేర తెరిచి ఉండడంతో పందులు తినేస్తున్నాయి. ఈ విషయంపై సీడీపీవో సుజాతను వివరణ కోరగా.. పౌష్టికాహారం గోదాంలో ఉన్న విషయం తెలియదని సమాధానం ఇచ్చారు.