అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు

అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు

హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సందడి కనిపిస్తోంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దర్శించుకున్నారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. కరోనా కారణంగా గత ఏడాది రాలేకపోయానన్నారు. ఇవాళ లండన్ వెళ్తున్నాని చెప్పారు. లాల్ దర్వాజా అమ్మవారికి పీవీ సింధు బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారు జామునుంచే అమ్మవారి ఆలయం వద్ద కోలాహలం కనిపిస్తోంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో భక్తులు భారీగా తరలివస్తున్నారు.బోనాలు సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా లాల్ దర్వాజ పరిసర ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.